‘అఖండ 2’ గురించి అదిరిపోయే అప్డేట్ !
ఈ షెడ్యూల్‌లో 'అఖండ 2'తో పాటు 'అఖండ 3' షూటింగ్ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు, ఈ సీక్వెల్‌లో ఒక భారీ ట్విస్ట్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారని.. ఇది అభిమానులను ఆశ్చర్యపరిచేలా ఉంటుందని సమాచారం.;
నందమూరి బాలకృష్ణ.. సూపర్‌స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2'లో నటిస్తున్నారనే ఊహాగానాలు అభిమానుల ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. అయితే.. బాలయ్య అభిమానుల్ని ఆకర్షించిన మరో విషయం 'అఖండ 2'కు సంబంధించిన అప్‌డేట్. మొదటి చిత్రం 'అఖండ' సృష్టించిన సంచలన విజయం తర్వాత... దాని సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడు, ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి కొత్త సమాచారం అభిమానుల ఆతృతను మరింత పెంచుతోంది.
'అఖండ 2' షూటింగ్ ప్రస్తుతం జార్జియాలోని అద్భుతమైన కాజ్‌బెగి ప్రాంతంలో జోరుగా సాగుతోంది. ఈ సినిమాకు ఎంచుకున్న నేపథ్యం, సుందరమైన మరింత మైలేజ్ ఇవ్వబోతుందని అంటున్నారు. ఇవి చిత్రానికి ఒక విజువల్ ట్రీట్‌గా నిలవనున్నాయని సమాచారం. మొదటి సినిమా సాధించిన కల్ట్ ఫాలోయింగ్‌కు తగ్గట్టుగా, ఈ సీక్వెల్‌లో విజువల్స్‌ను గ్రాండ్ స్కేల్‌లో చిత్రీకరిస్తున్నారని టాక్. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు ఎలాంటి రాజీ లేకుండా పనిచేస్తున్నారని ఇన్‌సైడర్స్ వెల్లడిస్తున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ షెడ్యూల్‌లో 'అఖండ 2'తో పాటు 'అఖండ 3' షూటింగ్ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు, ఈ సీక్వెల్‌లో ఒక భారీ ట్విస్ట్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారని.. ఇది అభిమానులను ఆశ్చర్యపరిచేలా ఉంటుందని సమాచారం. మొదట్లో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2025 లో రిలీజ్ చేయాలని టీమ్ భావించినప్పటికీ.. తాజా సమాచారం ప్రకారం ఆ ప్లాన్‌లో మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. రిలీజ్ డేట్ ను వాయిదా వేసినప్పటికీ.. అభిమానుల ఉత్సాహాన్ని పెంచేందుకు ఒక టీజర్ సిద్ధమైందని తెలుస్తోంది. ఈ టీజర్ 1 నిమిషం 6 సెకన్ల నిడివితో ఉందని, త్వరలోనే విడుదల కానుందని ఇన్‌సైడ్ టాక్.