అడివి శేష్ ‘డెకాయిట్’ రిలీజ్ అప్పుడేనా?

సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ‘డెకాయిట్’ చిత్రం డిసెంబర్ 2025లో థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ గురించి అధికారిక ప్రకటన సోమవారం వెలువడనుంది.;

By :  K R K
Update: 2025-05-23 09:31 GMT

ఇటీవల నానీ ‘హిట్ 3’ చిత్రంలో క్యామియో గా మెరిసిన యూత్ స్టార్ అడివి శేష్ చాలా కాలం తర్వాత మళ్లీ పూర్తి నిడివి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అతని సినిమాలు ‘గూఢచారి 2, డెకాయిట్’ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. చాలామంది ‘గూఢచారి 2’ నే ముందుగా విడుదలవుతుందని భావించారు. కానీ ఆశ్చర్యకరంగా ‘డెకాయిట్’ ముందుగా రిలీజ్ కాబోతోంది.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానియల్ డియో, గతంలో శేష్ హిట్ థ్రిల్లర్లు ‘క్షణం, గూఢచారిలకు పనిచేసినవాడు. ఇప్పుడు ‘డెకాయిట్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ‘డెకాయిట్’ చిత్రం డిసెంబర్ 2025లో థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ గురించి అధికారిక ప్రకటన సోమవారం వెలువడనుంది. మొదట్లో శ్రుతి హాసన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికై, ఆమెతో ఒక గ్లింప్స్ కూడా విడుదలైంది. కానీ తర్వాత ఆమె స్థానంలో ఇటీవల సంచలనంగా మారిన మృణాళ్ ఠాకూర్‌ను తీసుకున్నారు.

వివాదాస్పద బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ‘డెకాయిట్’ మూవీతో తెలుగు సినిమా పరిశ్రమలోకి విలన్ గా అడుగుపెడుతున్నాడు. సుప్రియ యార్లగడ్డ మరియు సునీల్ నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. సంగీతం భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నాడు.

Tags:    

Similar News