ఈమె కెరీర్ కు పెళ్ళి బ్రేక్ వేసిందా?

"హీరామండీ" వెబ్‌సిరీస్ భారీ విజయం సాధించినప్పటికీ.. కొత్త అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చిందని అదితి తెలిపింది.;

By :  K R K
Update: 2025-04-01 08:58 GMT

అందాల హైదరాబాదీ హీరోయిన్.. ఆదితిరావు హైదరి రీసెంట్ గా బొమ్మరిల్లు హీరో, తమిళ నేటివ్ అయిన సిద్ధార్థ్‌ను వివాహం చేసుకుని వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతోంది. పెళ్లి తర్వాత తన కెరీర్‌పై ఎలాంటి ప్రభావం పడకూడదని ఆశించిన ఆమెకు... ఇప్పుడు అనుకోకుండా అవకాశాలు తగ్గిపోతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇటీవల ఫరా ఖాన్ యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన "హీరామండీ" వెబ్‌సిరీస్ భారీ విజయం సాధించినప్పటికీ.. కొత్త అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చిందని అదితి తెలిపింది. ఇప్పుడిప్పుడే తన కెరీర్‌ స్లంప్ లో పడినట్టుందని.. ఏమాత్రం కదలిక కనిపించ డంలేదని బాధపడింది.

ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగా157 లో ఆమెకు అవకాశం దక్కే అవకాశాలున్నాయంటూ టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి.. ఆ ఆఫర్ ఆమెను వరిస్తుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News