ప్రభాస్ సినిమాలో అభిషేక్ బచ్చన్?
తాజా సమాచారం ప్రకారం... ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న 'ఫౌజీ' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం అభిషేక్ బచ్చన్‌ని సంప్రదించారట.;
బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ ఇప్పటికే కొన్ని తెలుగు చిత్రాల్లో నటించారు. వాటిలో 'మనం', 'సైరా నరసింహా రెడ్డి', 'కల్కి 2898 AD' సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. ఆయన కోడలు, గ్లోబల్ ఐకాన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా ఒక తెలుగు పాటలో కనిపించింది. ఇప్పుడు ఛోటా బచ్చన్ అభిషేక్ బచ్చన్ కూడా తన తెలుగు సినీ ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం... ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న 'ఫౌజీ' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం అభిషేక్ బచ్చన్‌ని సంప్రదించారట. ఆయన పాత్ర ఈ సినిమాలో ఒక సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తయిందని కూడా అంటున్నారు.
అమితాబ్ బచ్చన్‌కి, ప్రభాస్‌కి మధ్య ఉన్న మంచి అనుబంధం కారణంగా.. అభిషేక్ ఈ ఆఫర్‌కి సుముఖంగా ఒప్పుకున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అభిషేక్ బచ్చన్ బాలీవుడ్‌లో 'ధూమ్, సర్కార్’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం, ఆయన విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, కాన్సెప్ట్-డ్రివెన్ సినిమాలు, ఓటీటీ డ్రామాలలో నటిస్తూ తన కెరీర్‌ని విస్తరిస్తున్నారు.