'కోర్ట్' జంట ‘బ్యాండ్ మేళం’

‘కోర్ట్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్ష్ రోషన్ – శ్రీదేవి మళ్లీ కలిసి రాబోతున్నారు. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ నిర్మిస్తున్న ఈ కొత్త ప్రేమకథా చిత్రానికి ‘బ్యాండ్ మేళం’ అనే టైటిల్ ఫిక్స్ అయ్యింది.;

By :  S D R
Update: 2025-09-17 13:15 GMT

‘కోర్ట్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్ష్ రోషన్ – శ్రీదేవి మళ్లీ కలిసి రాబోతున్నారు. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ నిర్మిస్తున్న ఈ కొత్త ప్రేమకథా చిత్రానికి ‘బ్యాండ్ మేళం’ అనే టైటిల్ ఫిక్స్ అయ్యింది. సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహిస్తుండగా, కావ్య – శ్రావ్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

లేటెస్ట్ గా రిలీజైన టైటిల్ గ్లింప్స్‌లో తెలంగాణ పల్లెటూరి వాతావరణాన్ని సజీవంగా చూపించారు. రాజమ్మగా శ్రీదేవి, యాదగిరిగా హర్ష్ రోషన్ బావా–మరదళ్లుగా అలరించబోతున్నారు. తెలంగాణ జానపద గీతంతో ప్రారంభమయ్యే ఈ గ్లింప్స్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. విజయ్ బుల్గానిన్ సంగీతాన్నందిస్తుండగా ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యాన్ని సమకూరుస్తున్నాడు. మొత్తంమీద ‘బ్యాండ్ మేళం’ ఒక ఫీల్‌గుడ్ మ్యూజికల్ లవ్ స్టోరీగా రూపొందుతుందని ఈ టైటిల్ గ్లింప్స్ చెబుతోంది.


Full View


Tags:    

Similar News