‘పరదా’ చాటున ఓ స్టార్ హీరోయిన్ ?

Update: 2025-03-15 10:18 GMT

యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించిన కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్, ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలతో దూసుకెళ్లింది. అయితే, ఇటీవలి కాలంలో ఆమె జోరు కొంత తగ్గింది. చివరగా సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘టిల్లు స్క్వేర్’లో గ్లామరస్ లుక్‌తో కన్పించి అభిమానులను ఆశ్చర్యపరిచిన అనుపమ, ఇప్పుడు ‘పరదా’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో ప్రధాన పాత్రలో నటిస్తోంది.

‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ముగ్గురు మహిళల కథ చుట్టూ తిరుగుతుంది. ఇందులో అనుపమ ‘సుబ్బు’ అనే పల్లెటూరి అమ్మాయిగా నటిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించగా, ఇప్పుడు ఈ మూవీ గురించి ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ఆ వార్త ఏమిటంటే – ‘పరదా’ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత గెస్ట్ రోల్‌లో కనిపించనున్నట్లు టాక్. సినిమా క్లైమాక్స్‌లో సమంత పాత్ర ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. గతంలో ‘అ ఆ’ చిత్రంలో అనుపమ, సమంత కలిసి నటించగా, ఈ కాంబినేషన్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. మళ్లీ ఇప్పుడు వీరిద్దరు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారా? అన్నదే ఆసక్తికరంగా మారింది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంతో మరోసారి అనుపమ తన నటనతో ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.

Tags:    

Similar News