ఈ క్రేజీ సీక్వెల్ లో గ్లోబల్ స్టార్?
ఈ క్రేజీ సీక్వెల్ లో గ్లోబల్ స్టార్?
యూత్‌ను ఉర్రూతలూగించిన ఫ్రాంచైజ్‌లలో ‘ధూమ్’ సిరీస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. జాన్ అబ్రహం, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ వంటి టాప్ స్టార్స్ ఈ సిరీస్‌లో నటించి, అభిమానులను అలరించారు. 2013లో విడుదలైన ‘ధూమ్ 3’ తర్వాత, ఈ ఫ్రాంచైజ్ నుంచి కొత్త సినిమా రాకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. భారీ గ్రాస్ వసూళ్లు రాబట్టే సత్తా ఉన్నప్పటికీ, ‘ధూమ్ 4’పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.
సమాచారం ప్రకారం, యశ్ రాజ్ ఫిల్మ్స్ ‘ధూమ్ 4’ను ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలో లీడ్ రోల్ కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ కథలో నటనకు మంచి స్థానం ఉండడంతో, రామ్ చరణ్‌కి ఇది ఒక కీలకమైన చిత్రం అవుతుందని నిర్మాతలు నమ్ముతున్నారు. కథ నచ్చడంతో, ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తయిన తర్వాత దీనిపై స్పష్టత ఇస్తానని రామ్ చరణ్ చెప్పినట్టు సమాచారం.
మునుపటి సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ పాత్రను అభిషేక్ బచ్చన్ పోషించగా, అతని అసిస్టెంట్ క్యారెక్టర్‌లో ఉదయ్ చోప్రా కనిపించాడు. కానీ ఈసారి, ఆ పాత్రల్లో వరుణ్ ధావన్, కార్తీక్ ఆర్యన్‌లను తీసుకోబోతున్నట్టు టాక్ ఉంది. అంటే, ఈ సినిమా పూర్తిగా బాలీవుడ్ తరహాలోనే రూపొందబోతున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చి బాబుతో ఒక రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమాను చేస్తున్నాడు. అనంతరం సుకుమార్ దర్శకత్వంలో మరో చిత్రానికి కమిట్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్ వంటి టాప్ డైరెక్టర్స్‌తో సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ‘ధూమ్ 4’ కోసం ఆయన డేట్స్ ఎలా సర్దుబాటు చేస్తాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్.
ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాకు రెగ్యులర్‌గా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. మేకర్స్ ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ కొత్త ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ చేయనున్నాడు. మరి ‘ధూమ్ 4’లో రామ్ చరణ్ నిజంగానే నటించబోతున్నాడా? లేదా? అనే విషయంలో అధికారిక ప్రకటన కోసం ఎదురు చూడాల్సిందే!