టాలీవుడ్ హిట్ మెషీన్ .. అనిల్ రావిపూడి !
టాలీవుడ్ హిట్ మెషీన్ .. అనిల్ రావిపూడి !టాలీవుడ్‌లో హిట్ చిత్రాలను నిర్మించే దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి.. తన ప్రతిభతో సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడం విశేషం. ఇటీవల అనిల్ దర్శకత్వంలో విడుదలైన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఈ ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్, సంక్రాంతి పండుగకు సరైన సందర్భంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా విడుదలైన మొదటి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రావడంతో ఈ చిత్రానికి అదనపు థియేటర్లు, షోలు ఏర్పాటు చేస్తున్నారు. గత ఏడాది నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’ ద్వారా బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన అనిల్ రావిపూడి, ఈ ఏడాది వెంకటేష్‌కు కూడా ఘన విజయం అందించారు. ఈ విజయాల నేపథ్యంలో ఆయన పేరు పరిశ్రమలో మరింత గౌరవాన్ని సొంతం చేసుకుంది.
ఇప్పుడంతా అందరి దృష్టి వచ్చే ఏడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే మెగాస్టార్ చిరంజీవి చిత్రంపై ఉంది. చిరంజీవి కోసం అనిల్ సిద్ధం చేస్తున్న కథ గురించి సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఆయన తనదైన వినోదాత్మక మార్క్‌తో చిరంజీవి కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ అందించేందుకు సిద్ధమవుతున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. మెగాస్టార్ చిత్రంతో కూడా మరో సక్సెస్ ఫుల్ చాప్టర్ ప్రారంభం కానుందని ఆయన అభిమానులు విశ్వసిస్తున్నారు.