‘థగ్ లైఫ్‘ రన్ టైమ్

విశ్వనటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కలయికలో రూపొందిన చిత్రం ‘థగ్ లైఫ్‘. జూన్ 5న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా లేటెస్ట్ గా సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుంది.;

By :  S D R
Update: 2025-05-19 12:07 GMT

విశ్వనటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కలయికలో రూపొందిన చిత్రం ‘థగ్ లైఫ్‘. జూన్ 5న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా లేటెస్ట్ గా సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా నిడివి 2 గంటలు 45 నిమిషాలుగా నిర్ణయించారు.

హై ఇంటెన్స్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా ‘థగ్ లైఫ్‘ రాబోతుంది. ముఖ్యంగా మణిరత్నం స్టైల్ నేరేషన్, కమల్ హాసన్, శింబు స్టంట్స్ ఈ మూవీకి ఎంతో హైలైట్ గా నిలుస్తాయట. మరోవైపు స్వర మాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం, నేపథ్య సంగీతం ‘థగ్ లైఫ్‘కి ప్లస్ అవతాయని భావిస్తోంది టీమ్. ఇప్పటికే రెహమాన్ కంపోజిషన్ లో వచ్చిన ‘జింగూచా‘కి సూపర్బ్ రెస్పాన్స్ దక్కింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘సుగర్ బేబీ‘ అంటూ సెకండ్ సింగిల్ రాబోతుంది. మే 21న ఈ పాట విడుదలకానుంది.

ఈ సినిమాలో త్రిష, అభిరామి, అశోక్ సెల్వన్, నాజర్, జోజు జార్జ్ వంటి వారు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ట్రైలర్ తర్వాత అంచనాలు భారీగా పెంచుకున్న ‘థగ్ లైఫ్‘ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జయింట్ ఫిలిమ్స్ వంటి సంస్థలు భారీ బడ్జెట్ తో నిర్మించాయి.



Tags:    

Similar News