‘ప్రేమ వెల్లువ’ సాంగ్ మ్యాజిక్!

హీరో నాని, డైరెక్టర్ శైలేశ్ కొలను కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రైమ్ థ్రిల్లర్‌ ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’. నాని ఇందులో అర్జున్ సర్కార్ అనే పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా నటిస్తుండగా, 'కె.జి.యఫ్' బ్యూటీ శ్రీనిధి శెట్టి కథానాయికగా కనిపించబోతుంది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చింది.;

By :  S D R
Update: 2025-03-24 09:15 GMT

హీరో నాని, డైరెక్టర్ శైలేశ్ కొలను కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రైమ్ థ్రిల్లర్‌ ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’. నాని ఇందులో అర్జున్ సర్కార్ అనే పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా నటిస్తుండగా, 'కె.జి.యఫ్' బ్యూటీ శ్రీనిధి శెట్టి కథానాయికగా కనిపించబోతుంది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చింది.

‘ప్రేమ వెల్లువ’ అంటూ సాగే ఈ గీతం లీడ్ పెయిర్ నాని, శ్రీనిధి మధ్య రొమాంటిక్ మాంటేజెస్ తో ఆకట్టుకుంటుంది. మిక్కీ జె మేయర్ సంగీతంలో కృష్ణకాంత్ రాసిన ఈ సాంగ్ ను సిద్‌ శ్రీరామ్‌, నూతన మోహన్‌ అద్భుతంగా ఆలపించారు. 'హిట్ 3'లో నాని పవర్‌ఫుల్ అండ్ యారగెంట్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఈ పాటలో నాని క్యారెక్టర్ లోని రొమాంటిక్ యాంగిల్ ను చూపించారు.

'హిట్' ఫ్రాంఛైస్ లో వచ్చిన రెండు సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు ఈ థర్డ్ పార్ట్ పై మరింతగా అంచనాలు పెరిగాయి. మే 1న 'హిట్ 3' థియేటర్లలోకి రాబోతుంది.


Full View



Tags:    

Similar News