‘తమ్ముడు‘ నుంచి ‘జై బగళాముఖీ‘ గీతం

దైవ భక్తితో కూడిన పాటలను కంపోజ్ చేయడంలో మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్ నాథ్ ది ప్రత్యేకమైన శైలి. ‘కాంతార‘ కోసం అజనీష్ తీర్చిదిద్దిన వరాహరూపం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.;

By :  S D R
Update: 2025-06-24 11:48 GMT

దైవ భక్తితో కూడిన పాటలను కంపోజ్ చేయడంలో మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్ నాథ్ ది ప్రత్యేకమైన శైలి. ‘కాంతార‘ కోసం అజనీష్ తీర్చిదిద్దిన వరాహరూపం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో ‘తమ్ముడు‘ కోసం ‘జై బగళాముఖీ‘ గీతాన్ని కంపోజ్ చేశాడు. సినిమాలో ఓ కీలక సన్నివేశంలో వచ్చే ఈ పాట విజువల్ గా ఎంతగానో ఆకట్టుకోనున్నట్టు తెలుస్తోంది. అజనీష్ లోక్ నాథ్ సంగీతంలో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాసిన ఈ పాటను అబ్బీ.వి ఆలపించాడు.

జూలై 4న విడుదలకానున్న నితిన్ ‘తమ్ముడు‘ ప్రచారంలో స్పీడు పెంచారు మేకర్స్. మూవీ టీమ్ ఇప్పుడు వరుస ఇంటర్యూలతో బిజీగా ఉంది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. సీనియర్ హీరోయిన్ లయ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. ఇతర కీలక పాత్రల్లో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ కనిపించనున్నారు.


Full View


Tags:    

Similar News