'అసుర హననం' పాటతో హైప్‌ పెరిగింది!

పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు’ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు.;

By :  S D R
Update: 2025-05-21 10:25 GMT

పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు’ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం.కీరవాణి ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేశారు.

ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు హైప్‌ను పెంచగా, తాజాగా విడుదలైన మూడో పాట ‘అసుర హననం’ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. వీరమల్లు ధైర్యాన్ని ప్రతిబింబించే ఈ పాటలో కీరవాణి సంగీతం, రాంబాబు గోశాల రాసిన పదాలు ప్రశంసలు పొందుతున్నాయి.

ఈ పాట విడుదల సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ, ‘పవన్ కళ్యాణ్ మూర్తీభవించిన ధర్మాగ్రహం లాంటి వ్యక్తి. ఆయన కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఈ చిత్రానికి సంగీతం అందించాను‘ అన్నారు. దర్శకుడు జ్యోతి కృష్ణ తనకు దక్కిన అవకాశం పట్ల సంతోషం వ్యక్తం చేయగా.. నిర్మాత ఎ.ఎం. రత్నం ఈ సినిమాను తన 54 ఏళ్ల సినీ ప్రస్థానంలో మరో మైలురాయిగా అభివర్ణించారు. కథానాయిక నిధి అగర్వాల్ ఈ సినిమాను తనకు ఎమోషనల్ జర్నీగా పేర్కొన్నారు.

Tags:    

Similar News