'లైలా' నుంచి సెకండ్ సింగిల్ వచ్చింది!
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కొత్త సినిమా 'లైలా' ఫిబ్రవరి 14న ప్రేమికులరోజు కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లేటెస్ట్ గా 'లైలా' నుంచి సెకండ్ సింగిల్ ‘ఇచ్చుకుందాం బేబీ’ రిలీజయ్యింది.;
By : S D R
Update: 2025-01-23 11:17 GMT
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కొత్త సినిమా 'లైలా' రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఫిబ్రవరి 14న ప్రేమికులరోజు కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో ఈ సినిమా ప్రచారంలో స్పీడు పెంచారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్, ఫస్ట్ సింగిల్ 'సోనూ మోడల్' వంటి ప్రచార చిత్రాలు వచ్చాయి. లేటెస్ట్ గా 'లైలా' నుంచి సెకండ్ సింగిల్ ‘ఇచ్చుకుందాం బేబీ’రిలీజయ్యింది.
హీరోహీరోయిన్లు విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ మధ్య రొమాంటిక్ సాంగ్ గా ఈ పాటను చిత్రీకరించారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ లో ఆదిత్య ఆర్.కె., ఎమ్.ఎమ్.మానసి ఈ పాటను ఆలపించారు. 'లైలా' మూవీలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లోనూ సందడి చేయబోతున్నాడు. రామ్ నారాయణ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.