‘కల్కి 2’ షూటింగ్‌కు ప్రణాళిక సిద్ధం!
ప్రస్తుతం 'కల్కి 2' స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తయ్యాయట. ఈ ఏడాదిలోనే ఈ చిత్రాన్ని తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్.;
రెబెల్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న సీక్వెల్స్ సిరీస్ లో 'సలార్ 2'తో పాటు 'కల్కి 2' కూడా ఒకటి. బ్లాక్‌బస్టర్ మూవీ 'కల్కి 2898 ఎ.డి.'కి కొనసాగింపుగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రతిష్ఠాత్మక సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న 'కల్కి 2'కి సంబంధించి ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ పూర్తయ్యింది.
ప్రస్తుతం 'కల్కి 2' స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తయ్యాయట. ఈ ఏడాదిలోనే ఈ చిత్రాన్ని తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. అయితే ఈ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టాలంటే ప్రభాస్ కాల్షీట్స్ ఎంతో కీలకం. ప్రస్తుతం ఇండియాలోనే ఏ స్టార్ హీరో లేనంత బిజీగా వరుస సినిమాలతో ఉన్నాడు ప్రభాస్.
అందుకే 'కల్కి 2' కోసం రెబెల్ స్టార్ కాల్షీట్స్ ను అడ్జస్ట్ చేయాల్సి ఉంది. అలాగే 'కల్కి 2'లో ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ రోల్స్ కూడా ఎంతో కీలకం. వారు కూడా వేరే కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. కమల్, అమితాబ్ లకు సంబంధించి కూడా బల్క్ కాల్షీట్స్ అవసరమట. అలా.. ప్రధాన తారాగణానికి సంబంధించి కాల్షీట్స్ ను తీసుకున్న తర్వాతే 'కల్కి 2' షూటింగ్ కి వెళ్లాలనుకుంటున్నాడట నాగ్ అశ్విన్.
'కల్కి 2898 ఎ.డి.' ఘన విజయాన్ని సాధించిన నేపథ్యంలో.. 'కల్కి 2'ని విజువల్స్ పరంగా మరో స్థాయిలో రూపొందించడానికి కసరత్తులు చేస్తుందట టీమ్. టాప్ నాట్చ్ విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు సీక్వెల్ లో సందడి చేయనున్నాయట. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే యేడాదిలో 'కల్కి 2'ని విడుదల చేయాలనే కృత నిశ్చయంతో ఉందట టీమ్.