'ది ప్యారడైస్' డబుల్ ట్రీట్
నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ప్యారడైస్'. ఇప్పటికే 'దసరా' వంటి సూపర్ హిట్ అందించిన కాంబో కాబట్టి ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.;
నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ప్యారడైస్'. ఇప్పటికే 'దసరా' వంటి సూపర్ హిట్ అందించిన కాంబో కాబట్టి ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి రేపు (ఆగస్టు 8) రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లు రాబోతున్నాయి.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియాలో 'ది ప్యారడైజ్' ఫస్ట్ లుక్స్ పై అప్డేట్ ఇచ్చాడు. రేపు ఉదయం 10:05కి 'నా ఊహలో నాని ఎలా ఉన్నాడు?' అనే కాన్సెప్ట్ పోస్టర్, అలాగే సాయంత్రం 5:05కి 'అతని యాటిట్యూడ్, మేమిచ్చే హామీ' కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ కానున్నట్లు తెలిపాడు. నాని లుక్ మాత్రమే కాదు ఇక నుంచి సినిమాలోని ప్రతి పాత్రను రెండు పోస్టర్ల ద్వారా పరిచయం చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశాడు.
ఈ మూవీలో 'కిల్' ఫేమ్ రాఘవ జుయాల్ విలన్ గా నటిస్తున్నాడు. విలక్షణ నటుడు మోహన్ బాబు మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. 'దసరా' చిత్రాన్ని నిర్మించిన SLV సినిమాస్ బ్యానర్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది. పాన్ ఇండియా లెవెల్ లో 2026, మార్చి 26న 'ది ప్యారడైజ్' రిలీజ్ కు రెడీ అవుతుంది.