గోల్డెన్ ట్రయాంగిల్’ మిస్టరీ – ఎన్టీఆర్ మాస్ లీడర్ అవతారం!

Update: 2025-02-21 10:28 GMT

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లింది. నిన్నటి (ఫిబ్రవరి 20) నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. తొలిరోజు నుంచే భారీ స్థాయిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్, ప్రత్యేకమైన సెట్‌లో మూడు వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో కీలక ఘట్టాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. అయితే ఈ పార్ట్‌లో ఎన్టీఆర్ పాల్గొనలేదు. కానీ కథలో ప్రధానమైన ఘట్టానికి ఇది లీడ్‌గా ఉంటుందని అంటున్నారు.

ఫిల్మ్ సర్కిల్స్ ఇన్‌సైడ్ టాక్ ప్రకారం ప్రశాంత్ నీల్ సినిమా కథా నేపథ్యం ‘గోల్డెన్ ట్రయాంగిల్’ చుట్టూ తిరుగుతుందట. ఇది తూర్పు ఆసియాలో మయన్మార్, థాయిలాండ్, లావోస్ దేశాలను కలిపే కొండ ప్రాంతం. ఈ ప్రాంతం అంతర్జాతీయ డ్రగ్ మాఫియాకు అడ్డా అనే ప్రచారం ఉంది. అలాంటి ప్రాంతం నేపథ్యంతో ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నాడట ప్రశాంత్ నీల్.

‘కేజీఎఫ్, సలార్’లో మాఫియా అండర్‌వరల్డ్ టచ్ ఉంటే, ఈ సినిమాలో అంతకన్నా డీప్‌గా డ్రగ్ ట్రేడ్, మాఫియా బ్యాక్‌డ్రాప్ చూపిస్తారని తెలుస్తోంది. నిన్న రిలీజ్ చేసిన ఫోటో కూడా 70, 80 దశకాలకు చెందిన పాత అంబాసిడర్ కార్లు, సైకిళ్లతో రిట్రో లుక్‌తో ఉంది. ఈసినిమాలో ఎన్టీఆర్ పాత్ర మాఫియా ప్రపంచానికి వ్యతిరేకంగా పోరాడే ఓ యోధుడిగా ఉంటుందట. వచ్చే యేడాది ప్రథమార్థంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    

Similar News