‘విశ్వంభర’ కథ చెప్పేసిన డైరెక్టర్
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, ‘బింబిసారా’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతోన్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసింది.;
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, ‘బింబిసారా’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతోన్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసింది. తాజాగా, ఈ చిత్ర కథపై వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ దర్శకుడు వశిష్ఠ ఆసక్తికర విషయాలను షేర్ చేశారు.
వశిష్ఠ చెప్పిన స్టోరీ లైన్ ప్రకారం – 'మనకు మొత్తం 14 లోకాలు ఉన్నాయి. వీటిలో పైన 7, కింద 7. యమలోకం, స్వర్గం, పాతాళలోకం వంటి లోకాలు ఇప్పటికే ఎన్నోసార్లు తెరపై చూశాం. కానీ ఈ సినిమాలో మాత్రం వీటన్నింటినీ దాటి, బ్రహ్మదేవుడు నివసించే ‘సత్యలోకం’ను చూపించబోతున్నాం. ఆ లోకంలో ఉన్న హీరోయిన్‌ను హీరో ఎలా తీసుకొచ్చాడు? హీరో ఆ ప్రయాణాన్ని ఎలా చేశాడు? అనేదే కథామూలం' అని వివరించారు.
ఈ సినిమాకోసం వాస్తవ ప్రపంచాన్ని తలపించేలా సెట్స్ వేయించామని, ప్రపంచ స్థాయి వీఎఫ్‌ఎక్స్ కంపెనీలతో కలిసి పని చేస్తున్నామని వశిష్ఠ తెలిపారు. ముఖ్యంగా సెకండాఫ్ మొత్తం గ్రాఫిక్స్ ఆధారంగా సాగుతుందని, దాదాపు 70 శాతం భాగంలో వీఎఫ్‌ఎక్స్ ఉండబోతున్నట్లు చెప్పారు.
చిరంజీవికి జోడీగా త్రిష, ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు. అంతేకాదు, బాలీవుడ్ నటి మౌనీరాయ్‌తో చిరు ఓ స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం షూటింగ్ చివరిదశకు చేరగా, జూలై 25 నుంచి ఓ స్పెషల్ సాంగ్, ప్యాచ్ వర్క్ షూటింగ్ జరగనుంది. అక్టోబర్‌లో సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది. గతంలో 'జగదేక వీరుడు అతిలోక సుందరి, అంజి' లాంటి ఫాంటసీ చిత్రాల్లో చిరంజీవి మెప్పించినట్లే, ‘విశ్వంభర’ ద్వారా మరోసారి అభిమానులను మాయాలోకంలోకి తీసుకెళ్తారని అంచనాలు నెలకొన్నాయి.