'ఎ' సర్టిఫికెట్ తో 'తమ్ముడు'!

నితిన్ హీరోగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తమ్ముడు’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు.;

By :  S D R
Update: 2025-06-27 14:07 GMT

నితిన్ హీరోగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తమ్ముడు’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించగా, సీనియర్ నటి లయ కీలక పాత్రలో కనిపించనుంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం లేటెస్ట్ గా సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుంది. ఆశ్చర్యకరంగా ఈ మూవీకి 'A' సర్టిఫికెట్ వచ్చింది. ఇందులో యాక్షన్, హింసకు ఎక్కువ ప్రాధాన్యం ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. సాధారణంగా దిల్ రాజు బ్యానర్ పై వచ్చే సినిమాలకు ఈ రేటింగ్ రావడం చాలా అరుదు.

నితిన్ వరుస ఫ్లాపుల తర్వాత హిట్ కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్నాడు. 'తమ్ముడు' తనకు మంచి కమ్‌బ్యాక్ అవుతుందని భావిస్తున్నాడు. సిస్టర్ సెంటిమెంట్ మెయిన్ ఎలిమెంట్ గా జూలై 4న 'తమ్ముడు' రాబోతుంది.

Tags:    

Similar News