రెమ్యునరేషన్ లో తలైవా రికార్డ్!

వయసు మీద పడుతున్నా వన్నె తగ్గని ఉత్సాహంతో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. ప్రస్తుతం ఆయన నుంచి ‘కూలీ‘ ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకు రాబోతుండగా.. మరో చిత్రం ‘జైలర్ 2‘ చిత్రీకరణ దశలో ఉంది.;

By :  S D R
Update: 2025-05-08 08:58 GMT

వయసు మీద పడుతున్నా వన్నె తగ్గని ఉత్సాహంతో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. ప్రస్తుతం ఆయన నుంచి ‘కూలీ‘ ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకు రాబోతుండగా.. మరో చిత్రం ‘జైలర్ 2‘ చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పటికే ఘన విజయాన్ని సాధించిన ‘జైలర్‘కి సీక్వెల్ గా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నాడు నెల్సన్ దిలీప్ కుమార్.

‘జైలర్’ ఫస్ట్ పార్ట్ వరల్డ్ వైడ్ గా రూ.650 కోట్లు కొల్లగొట్టింది. అందుకే సీక్వెల్ ‘జైలర్ 2‘పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి రజనీకాంత్ అందుకుంటున్న రెమ్యునరేషన్ ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ‘జైలర్ 2’కు రజనీకాంత్ ఏకంగా రూ.200 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్టు కోలీవుడ్ టాక్. ఇది నిజమా? కాదా? అన్నది అధికారికంగా తేలాల్సివున్నా, ఈ సమాచారం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫస్ట్ పార్ట్ లో కేమియోలలో అలరించిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లతో పాటు.. సీక్వెల్ లో నటసింహం బాలకృష్ణ అతిథి పాత్రలో అలరించనున్నాడట. అనిరుధ్ ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ‘జైలర్ 2‘ నుంచి వచ్చిన అనౌన్స్ మెంట్ వీడియోకి అదిరిపోయే రేంజులో రెస్పాన్స్ దక్కింది.

Tags:    

Similar News