అపజయమెరుగని దర్శకుడి ప్రస్థానానికి పదేళ్లు!

ఎంటర్ టైన్ మెంట్ మెయిన్ మోటోగా మార్చుకుని వరుస విజయాలను అందుకుంటున్నాడు అనిల్ రావిపూడి. ఈరోజు (జనవరి 23) అనిల్ రావిపూడి తొలి చిత్రం 'పటాస్' విడుదలైన తేదీ.;

By :  S D R
Update: 2025-01-23 04:58 GMT

ఎంటర్ టైన్ మెంట్ మెయిన్ మోటోగా మార్చుకుని వరుస విజయాలను అందుకుంటున్నాడు అనిల్ రావిపూడి.2015లో 'పటాస్' మొదలు ఈ సంక్రాంతికి విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' వరకూ ఎనిమిది సినిమాలు చేశాడు. ఈ ఎనిమిది కూడా వరుస విజయాలు సాధించడం విశేషం.

ఈరోజు (జనవరి 23) అనిల్ రావిపూడి తొలి చిత్రం 'పటాస్' విడుదలైన తేదీ.అంటే ఈరోజుతో అనిల్ రావిపూడి సినీ ప్రస్థానానికి పదేళ్లన్నమాట. కొత్త టాలెంట్ ను పరిచయం చేయడంలో ఎప్పుడూ ముందుండే కళ్యాణ్ రామ్ ద్వారానే అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయమయ్యాడు. రొటీన్ కథే అయినా కొత్త కామెడీ సీన్స్ తో 'పటాస్'ను రేసీగా తీర్చిదిద్ది నందమూరి ఫ్యాన్స్ కు హిట్ ఇచ్చాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఎన్.టి.ఆర్. ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మించింది.

అయితే 'పటాస్' తర్వాత మళ్లీ కళ్యాణ్ రామ్ తో పనిచేసే అవకాశం అనిల్ రావిపూడికి రాలేదు. మళ్లీ వీరిద్దరి కాంబోలో సినిమాకోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం చిరంజీవితో కొత్త సినిమా కోసం సిద్ధమవుతున్నాడు అనిల్ రావిపూడి.

Tags:    

Similar News