శివశక్తిగా తమన్నా ఉగ్రరూపం
మిల్కీ బ్యూటీ తమన్నా శివ శక్తిగా డివోషనల్ క్యారెక్టర్ లో నటించిన చిత్రం ‘ఓదెల 2‘. ఇప్పటికే హిట్టైన ‘ఓదెల రైల్వే స్టేషన్‘కి కొనసాగింపుగా ఈ చిత్రం రూపొందింది. డివోషనల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ మూవీ కథ, కథనాల పరంగా ఓ కొత్త తరహా అనుభూతిని అందిస్తుందని ఇప్పటికే టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. లేటెస్ట్ గా ‘ఓదెల 2‘ ట్రైలర్ రిలీజయ్యింది.
దైవత్వానికి, తంత్రానికి మధ్య పోరాటం ఇతివృత్తంతో ఈ ట్రైలర్ ఆద్యంతం థ్రిల్లింగ్ అనుభూతిని అందించేలా ఉంది. శివశక్తి పాత్రలో నాగసాధుగా తమన్నా చెప్పిన డైలాగ్స్, యాక్షన్ ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా శివశక్తిగా తమన్నా ఉగ్రరూపం ఈ ట్రైలర్ లో కనిపించింది. ‘ఓదెల రైల్వే స్టేషన్‘ మూవీలో నటించిన హెబ్బా పటేల్ కూడా సీక్వెల్ లోనూ సందడి చేయబోతుంది. వశిష్ట ఎన్.సింహా, యువ, నాగ మహేష్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
ఇక ‘కాంతార, విరూపాక్ష‘ ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మరోసారి భయపెట్టబోతున్నట్టు ఈ ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీం వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి సంపత్ నంది కథ అందిస్తుండగా.. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 17న ‘ఓదెల 2‘ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది.