టబు డైనమిక్ రీ ఎంట్రీ!
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు. ఇటీవల వరుస పరాజయాలతో వెనుకబడిన పూరీ, ఈసారి ఖచ్చితంగా విజయాన్ని అందుకోవాలనే దృఢ సంకల్పంతో ఉన్నాడు.;
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు. ఇటీవల వరుస పరాజయాలతో వెనుకబడిన పూరీ, ఈసారి ఖచ్చితంగా విజయాన్ని అందుకోవాలనే దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఈ క్రమంలో తమిళ స్టార్ విజయ్ సేతుపతితో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఈ క్రేజీ కాంబినేషన్ ఇప్పటికే మంచి హైప్‌ను సొంతం చేసుకోగా, తాజాగా మరో ఆసక్తికరమైన అప్డేట్ అందించింది టీమ్. బాలీవుడ్ తో పాటు తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమైన నటి టబు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుంది. చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో, ఆమె పాత్రపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ సినిమాలో టబు క్యారెక్టర్ డైనమిక్‌గా ఉండబోతుందని సమాచారం. ‘అల వైకుంఠపురములో’లో తర్వాత టబు నటిస్తున్న తెలుగు సినిమా ఇది.
పూరీ జగన్నాధ్ మార్క్ డైలాగ్స్, మాస్ యాక్షన్ మేకింగ్‌తో ఈ సినిమా రూపొందబోతుంది. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాధ్, చార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీని తెలుగు, తమిళం, హింది, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.