పూరి-సేతుపతి ప్రాజెక్ట్‌లో టబు!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పుడు మంచి కమ్‌బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. తమిళ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో కలిసి ఓ వినూత్న ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు.;

By :  S D R
Update: 2025-04-06 02:08 GMT

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పుడు మంచి కమ్‌బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. తమిళ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో కలిసి ఓ వినూత్న ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. ఇది పూరీకి ఎంతో ప్రత్యేకమైన సినిమా కానుంది.

ఈ చిత్రానికి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. తన మార్క్ కమర్షియల్ హంగులను పక్కన పెట్టి.. పూర్తిగా కథ పైనే ఫోకస్ పెట్టాడట పూరి జగన్నాథ్. ఈ సినిమా ఓ పొలిటికల్ సెటైర్ గా రూపొందుతుందట. విజయ్ సేతుపతి ఇందులో ఓ బిచ్చగాడిగా కనిపించనున్నాడట. అతడి పాత్ర సమాజాన్ని ప్రశ్నించే విధంగా ఉండనున్నట్టు తెలుస్తోంది.

ఈ ప్రాజెక్ట్‌లోకి మరో స్టార్ అట్రాక్షన్ కలిసినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో వెటరన్ బ్యూటీ టబు కీలక పాత్రలో కనిపించనుందట. ఆమె రోల్ ను ఎంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దాడట పూరి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌లోకి టబు ఎంట్రీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందట. పూరీ జగన్నాథ్, చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే నెలలో షూటింగ్ మొదలు పెట్టుకోనుంది.

Tags:    

Similar News