రిలీజ్‌కు ముందే టేబుల్ ప్రాఫిట్
‘హనుమాన్’తో పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించిన తేజా సజ్జా ఇప్పుడు "మిరాయ్" తో వస్తున్నాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. విజువల్ వండర్‌గా నిలిచిన ట్రైలర్‌లో యాక్షన్, అడ్వెంచర్, వీఎఫ్‌ఎక్స్ సీన్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ముఖ్యంగా చివర్లో వచ్చే శ్రీరాముడు షాట్ గూస్‌బంప్స్ తెప్పించింది.
"మిరాయ్" కథలో తొమ్మిది శక్తివంతమైన గ్రంథాలను కాపాడే హీరో పోరాటం ప్రధానాంశం అని టీమ్ చెబుతుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ ఈ నెల 12న భారీ స్థాయిలో విడుదల కానుంది.
60 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి ఇప్పటికే ఓటీటీ, శాటిలైట్ రైట్స్ రూపంలోనే 45 కోట్లు వచ్చాయట. థియేట్రికల్ హక్కులు కూడా 25 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఇంకా ఆడియో, డబ్బింగ్ రూపంలోనూ కోట్లలో కొల్లగొట్టిందట. దీంతో రిలీజ్‌కి ముందే మేకర్స్ సుమారు 15 నుంచి 20 కోట్ల టేబుల్ ప్రాఫిట్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో రితిక నాయక్ హీరోయిన్‌గా నటించగా, మంచు మనోజ్, జగపతి బాబు, శ్రియ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీతో పాటు మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా విడుదల కానుంది. అలాగే చైనా, జపాన్ మార్కెట్లలోనూ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.