చిరంజీవి ప్రాజెక్ట్‌పై నాగవంశీ క్రేజీ అప్డేట్!

టాలీవుడ్ లో స్టెడీ హిట్స్ తో కొనసాగుతోన్న వారిలో వెంకీ అట్లూరిని ప్రస్తావించాలి. అలాంటి వెంకీ అట్లూరిని ఏకంగా మెగాస్టార్ చిరంజీవి పిలిచి ఛాన్స్ ఇచ్చారట.;

By :  S D R
Update: 2025-01-21 01:38 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టెడీ హిట్స్ తో కొనసాగుతోన్న వారిలో వెంకీ అట్లూరిని ప్రస్తావించాలి. ముందుగా కథ సిద్ధం చేసుకుని ఆ తర్వాత దానికి తగ్గ హీరోని నిర్ణయించుకోవడం వెంకీ స్టైల్. అలాంటి వెంకీ అట్లూరిని ఏకంగా మెగాస్టార్ చిరంజీవి పిలిచి ఛాన్స్ ఇచ్చారట. అయినా కథ లేదని చెప్పి మెగా మూవీకి నో చెప్పాడట వెంకీ.

ఇటీవలే నిర్మాత నాగవంశీ.. చిరంజీవి-వెంకీ అట్లూరి ప్రాజెక్ట్ గురించి క్రేజీ అప్డేట్ అందించారు. చిరంజీవితో వెంకీ అట్లూరి సినిమా గురించి చర్చలు జరిగిన మాట వాస్తవమేనని.. అయితే వెంకీ దగ్గర ప్రస్తుతానికి కథ లేకపోవడంతో ఒక సంవత్సరం లోపు సరైన స్టోరీ రెడీ చేసి మళ్లీ చిరంజీవికి వినిపిస్తానని చెప్పినట్టు లేటెస్ట్ ఇంటర్యూలో వెల్లడించారు నాగవంశీ.

మరోవైపు మెగాస్టార్ వరుసగా యువ దర్శకులను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే 'బింబిసార' ఫేమ్ వశిష్టతో 'విశ్వంభర' చేస్తున్న చిరు.. ఆ తర్వాత అనిల్ రావిపూడితో ఒక చిత్రాన్ని 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల తో మరో చిత్రాన్ని లైన్లో పెట్టాడు. తనకు 'వాల్తేరు వీరయ్య' వంటి విజయాన్నందించిన బాబీ తోనూ మరో మూవీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి.

Tags:    

Similar News