'కరుప్పు' లుక్ లో సూర్య!
విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేసే కోలీవుడ్ స్టార్ సూర్య. ఈ విలక్షణ నటుడు లేటెస్ట్ గా 'కరుప్పు' సినిమాతో రాబోతున్నాడు.;
By : S D R
Update: 2025-07-22 16:06 GMT
విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేసే కోలీవుడ్ స్టార్ సూర్య. ఈ విలక్షణ నటుడు లేటెస్ట్ గా 'కరుప్పు' సినిమాతో రాబోతున్నాడు. ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుండగా, స్వాసిక, ఇంద్రన్స్, యోగిబాబు, నట్టి సుబ్రమణ్యం కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సూర్య పుట్టినరోజు సందర్భంగా రేపు (జూలై 23న) ఈ సినిమా నుంచి టైటిల్ గ్లింప్స్ రానుంది. లేటెస్ట్ గా ఈ మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో నల్ల దుస్తుల్లో సూర్య రగ్డ్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ రివెంజ్ యాక్షన్ డ్రామాలో సూర్య న్యాయం కోసం పోరాడే మాస్ లీడర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రానుంది.