సుహాస్ కొత్త సినిమా ప్రారంభం!
సుహాస్ తాజాగా మరో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు సుహాస్. త్రిశూల్ విజనరి స్టూడియోస్ నుంచి ప్రొడక్షన్ నం2 గా వస్తున్న ఈ చిత్రంతో గోపి అచ్చర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.;
కమెడియన్ గా ప్రారంభమై.. ఇప్పుడు హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు సుహాస్. ప్రస్తుతం కీర్తి సురేష్ తో ‘ఉప్పు కప్పురంబు‘ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ కు రెడీ చేసిన సుహాస్.. మరోవైపు ‘ఓ భామ అయ్యో రామ‘ అనే రొమాంటిక్ సినిమాతో త్వరలో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. మరోవైపు తమిళంలో వెట్రిమారన్ నిర్మాణంలో చేస్తున్న ‘మండాడి‘ చిత్రీకరణ దశలో ఉంది.
తాజాగా మరో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు సుహాస్. త్రిశూల్ విజనరి స్టూడియోస్ నుంచి ప్రొడక్షన్ నం2 గా వస్తున్న ఈ చిత్రంతో గోపి అచ్చర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.బి నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‘లో సుహాస్ తో నటించిన శివాని నగరం హీరోయిన్ గా నటిస్తుంది. ఈరోజు రామానాయుడు స్టూడియోస్ లో జరిగిన ఈ మూవీ ఓపెనింగ్ కి దర్శకుడు నాగ్ అశ్విన్, హీరో సత్యదేవ్, నిర్మాత వంశీ నందిపాటి అతిథులుగా హాజరయ్యారు.