కొత్త ప్రయోగం దిశగా శ్రీకాంత్ అడ్డాల!
'కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి క్లాస్ చిత్రాలతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. క్లాస్ లోనే కాదు తనకు మాస్ ఎలిమెంట్స్ తోనూ మురిపించడం తెలుసని వెంకటేష్ తో 'నారప్ప' తీశాడు.;
'కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి క్లాస్ చిత్రాలతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. క్లాస్ లోనే కాదు తనకు మాస్ ఎలిమెంట్స్ తోనూ మురిపించడం తెలుసని వెంకటేష్ తో 'నారప్ప' తీశాడు. తమిళ 'అసురన్' రీమేక్ గా తెరకెక్కిన 'నారప్ప' ఓటీటీలో రిలీజై మంచి విజయాన్ని సాధించింది.
'నారప్ప' బాటలోనే 'పెదకాపు' అంటూ కొత్త హీరోతో ప్రయోగం చేశాడు. మేకింగ్ బాగున్నా కథలో దమ్ము లేకపోవడంతో 'పెదకాపు' ఫ్లాప్ అయ్యింది. 'పెదకాపు' తర్వాత వేరే హీరోలతో కొన్ని ప్రయత్నాలు చేసినా అవేమీ వర్కవుట్ అవ్వలేదట. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల ఇద్దరు హీరోయిన్లతో ఓ ప్రయోగం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడట.
తన ప్రాజెక్ట్ కు 'కూచిపూడి వారి వీధి' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇది ఇద్దరు అక్కా చెల్లెళ్ల కథగా ఉండబోతుందట. గతంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ద్వారా అన్నదమ్ముల బంధాన్ని చూపించిన ఆయన, ఇప్పుడు సిస్టర్ సెంటిమెంట్‌ను ప్రధానంగా చూపించబోతున్నట్ట తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తారట. మొత్తంగా త్వరలోనే శ్రీకాంత్ అడ్డాల నుంచి కొత్త సినిమాకి సంబంధించి అప్డేట్ రాబోతుంది.