టాలీవుడ్‌కు సోనాక్షి డబుల్ ఎంట్రీ!
బాలీవుడ్ బ్యూటీస్ ఒక్కొక్కరిగా టాలీవుడ్ కి క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. ఈ లిస్టులో సోనాక్షి సిన్హా కూడా చేరింది. సుధీర్ బాబు 'జటాధర' చిత్రంతో టాలీవుడ్ లోకి ప్రవేశించబోతుంది సోనాక్షి. 'జటాధర' నుంచి ఇప్పటికే సోనాక్షి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.;
బాలీవుడ్ బ్యూటీస్ ఒక్కొక్కరిగా టాలీవుడ్ కి క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. ఈ లిస్టులో సోనాక్షి సిన్హా కూడా చేరింది. సుధీర్ బాబు 'జటాధర' చిత్రంతో టాలీవుడ్ లోకి ప్రవేశించబోతుంది సోనాక్షి. 'జటాధర' నుంచి ఇప్పటికే సోనాక్షి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఆమె ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ మూవీతో పాటు మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అదే నాని 'ది ప్యారడైజ్'.
నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంలోనూ సోనాక్షి కన్ఫమ్ అయ్యిందనేది ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. ‘దసరా’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన శ్రీకాంత్ ఓదెల, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'ది ప్యారడైజ్' కోసం మరింత గ్రిప్పింగ్ స్క్రిప్ట్ రెడీ చేసినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో సోనాక్షి రోల్ ఎంతో రస్టిక్ గా ఉంటుందట. అంతేకాదు, ఆమెపై ఓ స్పెషల్ సాంగ్‌ను కూడా చిత్రీకరిస్తారట.
మొత్తంగా మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే యాక్షన్ ఎలిమెంట్స్, కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రాబోతున్న 'ది ప్యారడైజ్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ‘ది ప్యారడైజ్’కు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ మూవీలో మెయిన్ లీడ్ గా సోనాక్షి కనిపించబోతుందా? లేక ఓ కీలక పాత్రలో కనువిందు చేయనుందా? అనేది తెలియాల్సి ఉంది.