వివాదంపై శిరీష్ వివరణ
హీరో రామ్ చరణ్‌పై తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై నిర్మాత శిరీష్ వివరణ ఇచ్చారు.;
By : S D R
Update: 2025-07-02 13:50 GMT
హీరో రామ్ చరణ్‌పై తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై నిర్మాత శిరీష్ వివరణ ఇచ్చారు. ‘గేమ్ ఛేంజర్’ చిత్రం ఫలితం తర్వాత చరణ్, శంకర్ తమకు కాల్ చేయలేదని ఆయన చెప్పిన విషయం మెగాభిమానుల్లో అసంతృప్తి రేపింది. ఈనేపథ్యంలో నిర్మాత శిరీష్ వివరణ ఇస్తూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
'తమ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ కి.. రామ్ చరణ్, చిరంజీవికి మధ్య బలమైన అనుబంధం ఉందని' స్పష్టం చేశారు. అలాగే 'చరణ్ అంటే నాకు ఎంతో అభిమానం. మా మధ్య స్నేహంతో మాట దొర్లిందేమో. ఉద్దేశపూర్వకంగా అనలేదు. చరణ్‌తో ఇంకో సినిమా చేయబోతున్నాం. అది నా తొలి ఇంటర్వ్యూలో జరిగిన పొరపాటు మాత్రమే. అభిమానులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా' అని శిరీష్ చెప్పారు.