క్రేజీ మల్టీస్టారర్‌లో శ్రద్ధా కపూర్ స్పెషల్ సాంగ్!

Update: 2025-02-10 09:50 GMT

ఈ ఏడాది బాలీవుడ్ నుంచి రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో 'వార్ 2' ఒకటి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోషన్ కాంబోలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై అయన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

తాజాగా 'వార్ 2'లో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని టాక్. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఈ స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. హృతిక్, ఎన్టీఆర్, శ్రద్ధా కాంబినేషన్‌లో వచ్చే ఈ పాటపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. బాలీవుడ్ హీరోయిన్స్ లో డ్యాన్సుల్లో దిట్ట శ్రద్ధా కపూర్. అలాంటి శ్రద్ధా.. డ్యాన్సింగ్ సెన్సేషన్స్ తారక్-హృతిక్ లతో కలిసి స్టెప్పులేస్తే అదొక విజువల్ ట్రీట్ అని చెప్పొచ్చు.

మరోవైపు ఈ చిత్రంలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించనున్నాడట. దీంతో తారక్ కి హీరోయిన్ ఉంటుందా? లేదా? అనేది సస్పెన్స్. ఈ మూవీలో హృతిక్ కి జోడీగా కియారా అద్వానీ నటిస్తుంది. ఇక ఎన్టీఆర్-హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ ఘట్టాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయట. ఈ ఏడాది ఆగస్టులో 'వార్ 2' రిలీజ్ కు రెడీ అవుతుంది.

Tags:    

Similar News