శివరాజ్ కుమార్ @ 40!
శివరాజ్ కుమార్.. కన్నడ చిత్ర పరిశ్రమలో ఐకానిక్ నటుడు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడిగా చిత్ర రంగంలోకి ప్రవేశించినా అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరచుకున్నాడు.;
శివరాజ్ కుమార్.. కన్నడ చిత్ర పరిశ్రమలో ఐకానిక్ నటుడు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడిగా చిత్ర రంగంలోకి ప్రవేశించినా అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరచుకున్నాడు. లేటెస్ట్ గా శివరాజ్ కుమార్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 40 వసంతాలు పూర్తి చేసుకున్నాడు.
1986లో 'ఆనంద్' చిత్రంతో శివరాజ్ కుమార్ తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఈ చిత్రం ఆయనకు నటుడిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత, 'రథసప్తమి' (1986) చిత్రం బాక్సాఫీస్ విజయాన్ని అందించి, యువతలో ఆయనకు భారీ ఫాలోయింగ్‌ను సృష్టించింది. శివరాజ్ కుమార్ ఒకే తరహా సినిమాలు కాకుండా విభిన్న జానర్‌లలో విజయవంతమైన చిత్రాలు చేశాడు. యాక్షన్, రొమాన్స్, థ్రిల్లర్, సందేశం ఇలా.. శివరాజ్ ఎన్నో రకాల ప్రయోగాలు చేశాడు. ముఖ్యంగా 'ఓం' (1995) చిత్రం శివరాజ్ కుమార్ కెరీర్‌లో ఒక మైలురాయి.
నిర్మాతగానూ శివరాజ్ కుమార్ తన తల్లి స్థాపించిన పూర్ణిమా ఎంటర్‌ప్రైజెస్ ద్వారా పలు సినిమాలు నిర్మించాడు. శివరాజ్ కుమార్ నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని కన్నడ ఇండస్ట్రీ నుంచే కాదు.. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సైతం ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి శివరాజ్ కుమార్ కు ప్రత్యేకంగా వీడియో రూపంలో శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ 'పెద్ది'లో కీలక పాత్ర పోషిస్తున్నాడు శివరాజ్ కుమార్.