శంకర్‌కు షాక్.. 'రోబో' కేసు మళ్లీ తెరపైకి!

Update: 2025-02-20 16:39 GMT

15 ఏళ్ల క్రితం విడుదలైన సూపర్ హిట్ చిత్రం 'ఏంథిరన్' (రోబో) కు సంబంధించిన వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. 2011లో రచయిత ఆరూర్ తమిళనాథన్ తన కథ 'జిగూబా' నుండి కాపీ కొట్టి 'రోబో' తీశారని ఆరోపిస్తూ కోర్టులో కేసు వేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు ప్రారంభించింది.

ED విచారణలో శంకర్ ఈ చిత్రానికి రూ.11.5 కోట్లు పారితోషికంగా అందుకున్నట్లు తేలింది. దాంతో రూ.10.11 కోట్ల విలువైన ఆయన మూడు స్థిరాస్తులను ED అటాచ్ చేసింది. 1957 కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించారన్న అభియోగంతో ప్రివెన్షన్ అఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద ఈ చర్యలు తీసుకున్నారు. FTII (ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా) జరిపిన మరో విచారణలో 'ఏంథిరన్' మరియు 'జిగూబా' కథల మధ్య సారూప్యతలు ఉన్నట్లు తేలింది.

'రోబో' సినిమా అప్పట్లో రూ.290 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించింది. మరోవైపు 'ఇండియన్ 2, గేమ్ ఛేంజర్' సినిమాల పరాజయాలతో శంకర్ ఇప్పటికే కష్టాలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు ఈ పాత కేసు తిరిగి తెరపైకి రావడం ఆయనకు పెద్ద షాక్ అని చెప్పాలి. ప్రస్తుతం 'ఇండియన్ 3'తో పాటు.. 'వేల్పరి' అనే హిస్టారికల్ మూవీ పనిలో ఉన్నాడు శంకర్.

Tags:    

Similar News