సినిమాల్లో సీరియస్ పాత్రలు, తెరవెనుక గ్లామర్ ఫోజులు!

Update: 2025-01-19 14:07 GMT

తెలుగు సినిమాలలో తెలుగమ్మాయిలు కరువైపోతున్నారనే విమర్శలు కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే అలాంటి విమర్శకులకు తమదైన నటనతో చెక్ పెడుతూనే ఉన్నారు కొంతమంది తెలుగమ్మాయిలు. అలాంటి వారిలో సాయి కామాక్షి భాస్కర్ల ఒకరు.

డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యాము అనే వాళ్లు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. అయితే కామాక్షి డాక్టర్ అయిన తర్వాతే యాక్టర్ అయ్యింది. ఎమ్.బి.బి.ఎస్. పూర్తి చేసిన తర్వాత కొన్నాళ్లు అపోలో హాస్పిటల్స్ లో డాక్టర్ గా పనిచేసిన కామాక్షికి 'మా ఊరి పొలిమేర' చిత్రం మంచి పేరు తీసుకొచ్చింది.

'మా ఊరి పొలిమేర', ఆ తర్వాత సీక్వెల్ 'పొలిమేర 2' రెండింటిలోనూ తనదైన అభినయంతో అదరగొట్టింది. ఈ సినిమాలలో డీగ్లారస్ రోల్స్ లో మెప్పించింది కామాక్షి. ఇంకా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, విరూపాక్ష, ఓం భీమ్ బుష్' వంటి చిత్రాల్లో ప్రాధాన్యత గల పాత్రల్లో అలరించింది.

మరోవైపు ఓటీటీ లలో సైతం వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది. 'ఝాన్సీ, సైతాన్, దూత' వంటి వెబ్ సిరీస్‌లలో తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఈ ప్రాజెక్టుల్లో సీరియస్, ఎమోషనల్ పాత్రలను పోషించి మంచి ప్రశంసలు అందుకుంది. త్వరలో 'మెన్షన్ హౌస్ మల్లేష్'తో రాబోతుంది.

ఇప్పటివరకూ తెరపై డీగ్లారస్ రోల్స్ లో నటించినా.. తెరవెనుక మాత్రం గ్లామరస్ ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది కామాక్షి. ఇటీవల ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన హాట్ ఫోటోలు నెటిజన్లను బాగా ఆకర్షిస్తున్నాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఇకపై కామాక్షిని గ్లామరస్ రోల్స్ లో చూడాలనుకుంటున్నట్టు కామెంట్స్ పెడుతున్నారు.

Tags:    

Similar News