కొత్త పంథాను అవలంబిస్తున్న సీనియర్ హీరోలు!
ప్రస్తుతం తెలుగు, తమిళంలలో ఉన్న సీనియర్ హీరోలంతా 65 ప్లస్ లో ఉన్నవారే. అయితే వీరిలో కొంతమంది సీనియర్స్ కి హిట్స్ దక్కుతుంటే.. మరికొంత మంది వరుసగా అపజయాలను అందుకుంటున్నారు.;
ప్రస్తుతం తెలుగు, తమిళంలలో ఉన్న సీనియర్ హీరోలంతా 65 ప్లస్ లో ఉన్నవారే. అయితే వీరిలో కొంతమంది సీనియర్స్ కి హిట్స్ దక్కుతుంటే.. మరికొంత మంది వరుసగా అపజయాలను అందుకుంటున్నారు. ఒకసారి మన సీనియర్స్ హిట్ ట్రాక్ ను పరిశీలిస్తే.. వారు ఎంచుకున్న సబ్జెక్ట్స్, వారి క్యారెక్టర్స్ ఆ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ప్రస్తుతం తెలుగు, తమిళంలలో ఉన్న సీనియర్ హీరోలంతా 65 ప్లస్ లో ఉన్నవారే. అయితే వీరిలో కొంతమంది సీనియర్స్ కి హిట్స్ దక్కుతుంటే.. మరికొంత మంది వరుసగా అపజయాలను అందుకుంటున్నారు.
విశ్వనటుడు కమల్ హాసన్ 'విక్రమ్' సినిమాలో తాత గా నటించాడు. రొమాన్స్‌కి దూరంగా ఉండి, తన పాత్రలో బలాన్ని చూపించాడు. 'విక్రమ్' భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత రజనీకాంత్ కూడా 'జైలర్' కోసం తాత పాత్రలో అదరగొట్టాడు. అలా.. వీరిద్దరూ వయసుకు తగ్గ పాత్రల్లో నటించి అలరించడంతోనే భారీ విజయాలు దక్కాయి.
తెలుగులో బాలకృష్ణ కూడా అదే పంథాను అవలంబిస్తున్నాడు. 'భగవంత్ కేసరి'లో బాలయ్యకి కాజల్ హీరోయిన్ గా నటించింది. అయినా వీరిద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు దాదాపు లేవనే చెప్పాలి. 'డాకు మహారాజ్'లోనూ అదే పంథాను అవలంభించాడు బాలయ్య.
సంక్రాంతి బరిలో విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంలో వెంకటేష్ కూడా తండ్రి పాత్రలో అదరగొట్టాడు. తనదైన శైలిలో ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్ ను ఎంచుకుని 'సంక్రాంతికి వస్తున్నాం'తో హిట్ కొట్టాడు.
ఇప్పుడు ఈ సీనియర్స్ బాటలోనే చిరంజీవి, నాగార్జున వంటి వారు కూడా విజయాలు సాధించాల్సిన పరిస్థితి ఉంది. వీరు కూడా తమ వయసుని దృష్టిలో పెట్టుకుని పాత్రలను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం చిరు, నాగ్ చేస్తున్న సినిమాలు కూడా ఆ పంథాలోనే సాగబోతున్నాయనే హింట్స్ వస్తున్నాయి.