'సింగిల్' నుంచి సెకండ్ సింగిల్!

శ్రీవిష్ణు హీరోగా కార్తిక్‌రాజు దర్శకత్వంలో రూపొందుతున్న '#సింగిల్‌' చిత్రంపై ఆసక్తి పెరుగుతోంది.;

By :  S D R
Update: 2025-04-18 01:42 GMT

శ్రీవిష్ణు హీరోగా కార్తిక్‌రాజు దర్శకత్వంలో రూపొందుతున్న '#సింగిల్‌' చిత్రంపై ఆసక్తి పెరుగుతోంది. కేతిక శర్మ, ఇవానా ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తుండగా, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ చివరిదశకు చేరుకున్న ఈ సినిమా ప్రచారంలో స్పీడు పెంచుతున్నారు మేకర్స్. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజయ్యింది.

'#సింగిల్‌' నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ఇద్దరు హీరోయిన్స్ తో శ్రీవిష్ణు రొమాంటిక్ గీతంగా అలరించింది. ఇప్పుడు వచ్చిన సెకండ్ సింగిల్ 'సిర్రాకైయింది సింగిల్ బతుకు' అంటూ సోలో లైఫ్ గురించి సిర్రాక్ గా పాడుకునే గీతమిది. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ లో రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ ఎనర్జిటిక్ గా ఆలపించాడు. ఈ పాటలో శ్రీవిష్ణుతో పాటు వెన్నెల కిషోర్ కూడా సందడి చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్ పై విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే నెలలో '#సింగిల్‌' రిలీజ్ కు రెడీ అవుతుంది.


Full View


Tags:    

Similar News