‘కింగ్డమ్‘ నుంచి సత్యదేవ్ లుక్!
నవతరం హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుని సాగుతున్నాడు సత్యదేవ్. సినిమా సినిమాకీ కథల విషయంలో వైవిధ్యం కోసం తపన పడే సత్యదేవ్.. తొలుత చిన్న పాత్రలలో నటించాడు.;
నవతరం హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుని సాగుతున్నాడు సత్యదేవ్. సినిమా సినిమాకీ కథల విషయంలో వైవిధ్యం కోసం తపన పడే సత్యదేవ్.. తొలుత చిన్న పాత్రలలో నటించాడు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'జ్యోతిలక్ష్మి' సినిమాతో ఫుల్ లెన్త్ హీరోగా మారాడు. 'అంతరిక్షం, ఇస్మార్ట్ శంకర్' వంటి సినిమాలలో హీరోలకు సమానమైన పాత్రలలోనూ అలరించాడు.
'బ్లఫ్ మాస్టర్, బ్రోచేవారెవరురా' సినిమాలు ఈ టాలెంటెడ్ హీరోకి హీరోగా మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక.. లాక్ డౌన్ సీజన్ లో ఓటీటీలో హిట్స్ అందుకున్న హీరోగానూ సత్యదేవ్ గుర్తింపు పొందాడు. '47 డేస్, గువ్వా గోరింక, ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య‘ వంటి సినిమాలు కోవిడ్ టైమ్ లో మంచి ప్రేక్షకాదరణ పొందాయి.
మెగా మూవీస్ అయిన ‘ఆచార్య‘లో అతిథిగా, ‘గాడ్ ఫాదర్‘లో విలన్ గానూ అలరించాడు. ఇప్పుడు హీరోగా నటిస్తూనే క్యారెక్టర్స్ లోనూ మురిపించడానికి ముస్తాబవుతున్నాడు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్‘లో శివ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి అన్నయ్య పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నాడట. ఈరోజు (జూలై 4) బర్త్ డే స్పెషల్ గా ‘కింగ్డమ్‘ నుంచి సత్యదేవ్ లుక్ రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్.