మిలియన్ డాలర్ క్లబ్‌లో 'సంక్రాంతికి వస్తున్నాం'!
సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన తెలుగు చిత్రాల్లో 'సంక్రాంతికి వస్తున్నాం' ప్రత్యేక గుర్తింపు సాధించింది. వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను బాగా ఆకర్షిస్తుంది. పండుగ సీజన్ అడ్వాంటేజ్‌తో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ట్రెమండస్ రెస్పాన్స్ అందుకుంటోంది.
పండుగ రోజుల్లో అదనపు షోలను ఏర్పాటు చేయాల్సిన స్థాయిలో డిమాండ్ పెరిగింది. మూడు రోజుల్లోనే గుంటూరు, సీడెడ్ ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ సాధించడం ఈ సినిమా క్రేజ్‌కు నిదర్శనం. పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం పండుగ సీజన్‌లో అద్భుత విజయాన్ని అందుకుంటోంది.
ప్రత్యేకంగా నార్త్ అమెరికాలో ఈ చిత్రానికి విశేష ఆదరణ లభిస్తోంది. మూడు రోజుల్లోనే ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరడం విశేషం. వెంకటేష్ వింటేజ్ చిత్రాలకు తగ్గట్టుగా, ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా, భీమ్స్ సంగీతం అందించాడు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మించాడు.