'సంక్రాంతి వస్తున్నాం' దూకుడు.. మహేష్ కాంప్లిమెంట్స్!

Update: 2025-01-16 01:30 GMT

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే విజయాన్ని సాధిస్తోంది. ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి దర్శకుడు అనిల్ రావిపూడి అందించిన ఎంటర్ టైన్‌మెంట్ ప్రేక్షకులను థియేటర్లకు క్యూ కట్టిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు అత్యద్భుతమైన స్పందన లభిస్తోంది.




నార్త్ అమెరికాలో ఈ సినిమా ఇప్పటివరకు 800K డాలర్లు వసూలు చేసి, మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరడానికి సిద్ధంగా ఉంది. ఫుల్ లెన్త్ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ సినిమా చూడడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు ఓవర్సీస్ ఆడియన్స్. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అన్ని ప్రధాన థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షో సమాచారం ప్రకారం, ఈ చిత్రం 1.05 మిలియన్ టికెట్లు అమ్ముడవడం మరో విశేషం.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, 'ఈ సంక్రాంతికి సరైన సినిమా అందించారని' చిత్రబృందాన్ని ప్రశంసించాడు. వెంకటేష్ నటన అద్భుతంగా ఉందని, అనిల్ రావిపూడి దర్శకత్వం గర్వించదగ్గదని, ముఖ్యంగా బుల్లి రాజుగా నటించిన చిన్నారిని ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు మహేష్.

ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా మెప్పించగా, భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచింది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Tags:    

Similar News