సంగీత్ శోభన్ ‘గ్యాంబ్లర్స్’ ట్రైలర్

‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలతో యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సంగీత్ శోభన్. ప్రెజెంట్ ఈ యంగ్ హీరో ‘గ్యాంబ్లర్స్‘ చిత్రంతో వస్తున్నాడు.;

By :  S D R
Update: 2025-06-01 11:46 GMT

‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలతో యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సంగీత్ శోభన్. ప్రెజెంట్ ఈ యంగ్ హీరో ‘గ్యాంబ్లర్స్‘ చిత్రంతో వస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్ రాగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఈ సినిమా ఆద్యంతం జూదం నేపథ్యంలో ఉండబోతున్నట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ‘ఆడటం చేతగాని వాడికి జూదం అంటే నేరం అనిపిస్తుంది.. ఆడటం తెలిసిన వాడికి జూదం నేరం కాదు‘ అనే డైలాగ్స్ ఎఫెక్టివ్ గా ఉన్నాయి. జూదం మెయిన్ థీమ్ గా రూపొందిన ఈ థ్రిల్లర్ మూవీలో సంగీత్ శోభన్ గెటప్ బాగుంది. సంగీత్ కౌబాయ్ గెటప్‌లో కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ మూవీలో ప్రశాంతి చారులింగా హీరోయిన్ కాగా.. రాకింగ్‌ రాకేష్‌, పృథ్వీరాజ్‌, సాయి శ్వేత కీలక పాత్రలు పోషించారు.

కేఎస్‌కే చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను రేష్మాస్ స్టూడియోస్, స్నాప్ అండ్ క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై సునీత, రాజ్‌కుమార్ బృందావనంలు నిర్మించారు. త్వరలో ‘గ్యాంబ్లర్స్‘ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

Tags:    

Similar News