బాలకృష్ణ 'అఖండ 2' కోసం సంయుక్త మీనన్!
బాలకృష్ణ 'అఖండ 2'లో హీరోయిన్ గా సంయుక్త మీనన్ ఎంపికయ్యింది. తెలుగులో సూపర్ హిట్ ట్రాక్ రికార్డ్ ఉన్న సంయుక్తని ఆన్ బోర్డు లోకి తీసుకున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్.;
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ హిట్ తో వరుసగా నాలుగు విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు నటసింహం.
ఇప్పుడు బాలయ్య తర్వాత సినిమా 'అఖండ 2' పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ ఎంపికయ్యింది. తెలుగులో సూపర్ హిట్ ట్రాక్ రికార్డ్ ఉన్న సంయుక్తని ఆన్ బోర్డు లోకి తీసుకున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్.
ఈ సినిమాలో బాలయ్యకి జోడీగా ప్రగ్య జైస్వాల్ నటిస్తున్నట్టు ఇప్పటికే తెలిపింది టీమ్. ఫస్ట్ పార్ట్ లో ప్రగ్య రోల్ ను సీక్వెల్ లోనూ కంటిన్యూ చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. అయితే సంయుక్త.. ప్రగ్య స్థానాన్ని భర్తీ చేస్తుందా, లేక మరో కొత్త పాత్రగా కనిపిస్తుందా అన్నది ఇంకా తెలియాలి.
ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25న దసరా కానుకగా 'అఖండ 2' ఆడియెన్స్ ముందుకు రానుంది.