‘రాక్షసి’గా సంయుక్త మీనన్
వివేకంతో సినిమాలు ఎంచుకుంటూ, ఒక్కో మెట్టుగా పరిశ్రమలో తన స్థానం పటిష్టం చేసుకుంటున్న మలయాళీ సుందరి సంయుక్త మీనన్.;
వివేకంతో సినిమాలు ఎంచుకుంటూ, ఒక్కో మెట్టుగా పరిశ్రమలో తన స్థానం పటిష్టం చేసుకుంటున్న మలయాళీ సుందరి సంయుక్త మీనన్. టాలీవుడ్ లో టాప్ సక్సెస్ రేట్ తో దూసుకెళ్తున్న సంయుక్త ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తుంది. 'చింతకాయల రవి' ఫేమ్ యోగి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంయుక్త కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తుండడం విశేషం.
ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో యాక్షన్‌తో కూడిన వైల్డ్ బిహేవియర్ ఉన్న క్యారెక్టర్ లో సంయుక్త సందడి చేయబోతుందట. అందుకోసమే ఈ సినిమాకి 'రాక్షసి', 'భైరవి' అనే పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పేర్లను ఫిల్మ్ ఛాంబర్ లో రిజిష్టర్ చేయించారట. మరోవైపు బాలకృష్ణ 'అఖండ 2', నిఖిల్ 'స్వయంభు', శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' చిత్రాలు కూడా సంయుక్త కిట్టీలో ఉన్నాయి.