బాక్సాఫీస్ వద్ద 'సయ్యారా' సెన్సేషన్
కంటెంట్ కనెక్ట్ అయితే చాలు అది చిన్న చిత్రమా? పెద్ద సినిమాయా అని ఆలోచించరు ఆడియన్స్. వాటికి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటారు.;
కంటెంట్ కనెక్ట్ అయితే చాలు అది చిన్న చిత్రమా? పెద్ద సినిమాయా అని ఆలోచించరు ఆడియన్స్. వాటికి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటారు. అందుకు లేటెస్ట్ ఎగ్జాంఫుల్ 'సయ్యారా'. జూలై 18న బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రిలీజైన ‘సయ్యారా’ ఇప్పటికీ సెన్సేషన్ సృష్టిస్తుంది. మోహిత్ సూరి దర్శకత్వంలో అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా నటించిన ఈ రొమాంటిక్ డ్రామా విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.
యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం, నెమ్మదిగా వసూళ్ల వర్షం కురిపిస్తూ, తొమ్మిదో రోజుకు రూ.300 కోట్ల గ్రాస్‌ను దాటింది. ఇందులో ఇండియా నుంచి రూ. 229 కోట్లు, ఓవర్సీస్ నుంచి రూ. 53 కోట్లు వచ్చాయి. ఈ ఏడాది విక్కీ కౌశల్ 'ఛావా' తర్వాత, ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన రెండవ బాలీవుడ్ చిత్రం ‘సయ్యారా’ కావడం విశేషం.
'సయ్యారా' విజయాన్ని దృష్టిలో పెట్టుకునే అజయ్ దేవ్ గన్ తన 'సన్ ఆఫ్ సర్దార్-2' సినిమాను వారం ఆలస్యం గా తీసుకురాబోతున్నాడు. మొత్తంగా.. నూతన నటీనటులతో రూపొందిన 'సయ్యారా' ఈ రేంజ్ సెన్సేషన్ సృష్టించడం ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.