ఐఎండిబి టాప్ లిస్ట్‌లో ‘రాబిన్‌హుడ్’!
యూత్‌స్టార్ నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తున్న ‘రాబిన్‌హుడ్’ విడుదలకు సిద్ధమైంది. ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం మార్చి 28న థియేటర్లలో సందడి చేయనుంది.;
యూత్‌స్టార్ నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తున్న ‘రాబిన్‌హుడ్’ విడుదలకు సిద్ధమైంది. ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం మార్చి 28న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటివరకు విడుదలైన టీజర్, సాంగ్స్ వంటి ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాయి.
నితిన్-వెంకీ కుడుమల కాంబోలో 'భీష్మ' వంటి హిట్ తర్వాత వస్తుండడంతో ఈ సినిమాపై మొదటి నుంచీ మంచి అంచనాలున్నాయి. ఆ అంచనాలను మరింత రెట్టింపు చేసేలా తాజాగా ఈ మూవీకి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ప్రఖ్యాత అంతర్జాతీయ సినిమా డేటాబేస్ ఐఎండిబి (IMDb) రిపోర్ట్ ప్రకారం, మార్చిలో విడుదలవుతున్న చిత్రాల్లో ‘రాబిన్‌హుడ్’ తెలుగు ప్రేక్షకులు అత్యధికంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రంగా నిలిచింది. ఈ ర్యాంకింగ్ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేసింది.
ఈ సినిమాలో నితిన్ కి జోడీగా శ్రీలీల నటిస్తుండగా, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ వంటి స్టార్ క్యాస్ట్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందని సినీ వర్గాలు విశ్వసిస్తున్నాయి.