రిషబ్ శెట్టి బర్త్ డే ట్రీట్!

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన 'కాంతార' చిత్రం ఘన విజయాన్ని సాధించింది. దాదాపు రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం కన్నడ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.;

By :  S D R
Update: 2025-07-07 04:25 GMT

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన 'కాంతార' చిత్రం ఘన విజయాన్ని సాధించింది. దాదాపు రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం కన్నడ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ సాధించడమే కాదు అవార్డుల్లోనూ అదరహో అనిపించింది.

2022వ సంవత్సరానికి 'కాంతార' చిత్రంలోని నటనకు గానూ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు రిషబ్ శెట్టి. ప్రస్తుతం 'కాంతార'కి ప్రీక్వెల్ గా 'కాంతార: ఛాప్టర్ 1' రాబోతుంది. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా కొత్త పోస్టర్ రిలీజయ్యింది. ఈరోజు (జూలై 7) రిషబ్ శెట్టి బర్త్ డే స్పెషల్ గా వచ్చిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ లో ఓ యోధుడిగా ఆకట్టుకుంటున్నాడు రిషబ్.

'కాంతార: ఛాప్టర్ 1' లేటెస్ట్ పోస్టర్ లో రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు. అక్టోబర్ 2న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 'కాంతార'కి మిన్నగా ప్రీక్వెల్ భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ 'కాంతార ఛాప్టర్ 1'లో హైలైట్ కానున్నాయట. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి రిషబ్ దర్శకత్వం వహిస్తుండగా, అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు.



Tags:    

Similar News