రిలీజ్‌కు ముందే రికార్డు డీల్స్!
సినిమా ఇండస్ట్రీలో హిట్, ఫ్లాప్ అనేవి సహజమే. కానీ కొన్నేళ్లుగా వరుస విజయాలతో నిలకడగా ఎదుగుతున్న హీరోల్లో నాని ఒకడు. హీరోగా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ను సెట్ చేసుకోడమే కాకుండా, నిర్మాతగా కూడా విశేషంగా రాణిస్తున్నాడు.;
సినిమా ఇండస్ట్రీలో హిట్, ఫ్లాప్ అనేవి సహజమే. కానీ కొన్నేళ్లుగా వరుస విజయాలతో నిలకడగా ఎదుగుతున్న హీరోల్లో నాని ఒకడు. హీరోగా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ను సెట్ చేసుకోడమే కాకుండా, నిర్మాతగా కూడా విశేషంగా రాణిస్తున్నాడు. నాని నిర్మాణ సంస్థ నుంచి లేటెస్ట్‌గా వచ్చిన 'కోర్ట్' సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా తెలుగు సినిమాలు ఓటీటీ డీల్స్ క్లోజ్ కాకపోవడంతో విడుదలకు నోచుకోలేకపోతున్నాయి. కానీ నాని సినిమాలకు మాత్రం రిలీజ్‌కు ముందే భారీ డీల్స్ క్లోజ్ అవుతున్నాయి. 'కోర్ట్' మూవీని నెట్‌ఫ్లిక్స్ రూ.8 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇక నాని హీరోగా నటించబోయే 'ది ప్యారడైజ్' షూటింగ్ మొదలు కాకముందే ఓటీటీ హక్కులు రూ.65 కోట్లకు అమ్ముడుపోయాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
లేటెస్ట్ గా నాని మరో చిత్రం 'హిట్ 3'కి క్రేజీ ఓటీటీ డీల్ వచ్చిందట. ఈ సినిమాని నెట్‌ఫ్లిక్స్ రూ.55 కోట్లకు దక్కించుకున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. మొత్తంగా టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోల్లో నాని తనకంటూ ఓ స్టార్ ఇమేజ్ ను సెట్ చేసుకోవడమే కాకుండా, రోజురోజుకీ తన మార్కెట్‌ను పెంచుకుంటూ వెళుతున్నాడు. 'హిట్ 3' చిత్రం మే 1న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మరోవైపు త్వరలో పట్టాలెక్కే 'ది ప్యారడైజ్' 2026, మార్చి 26న రానుంది.