నైట్ ఎఫెక్ట్ లో మొదలైన RC16 షూటింగ్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RC16 కొత్త షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. నైట్ ఎఫెక్ట్ లో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడట డైరెక్టర్ బుచ్చిబాబు. అయితే ప్రస్తుతం చరణ్ కాకుండా మిగతా నటీనటులపై సీన్స్ ను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది.;
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RC16 కొత్త షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. నైట్ ఎఫెక్ట్ లో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడట డైరెక్టర్ బుచ్చిబాబు. అయితే ప్రస్తుతం చరణ్ కాకుండా మిగతా నటీనటులపై సీన్స్ ను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వీకెండ్ వరకూ రామ్ చరణ్ కూడా లేటెస్ట్ షెడ్యూల్ లో జాయిన్ అవుతాడట.
ఇప్పటికే మైసూర్ లో RC16 కోసం కీలక షెడ్యూల్ ని పూర్తి చేశారు. అక్కడ హీరోహీరోయిన్లు రామ్ చరణ్, జాన్వీ కపూర్ లపై సీన్స్ ను చిత్రీకరించారు. ఈ సినిమాలో జగపతిబాబు, శివ రాజ్ కుమార్ వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆద్యంతం ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు బుచ్చిబాబు.
వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి బరిలో విడుదలైన ‘గేమ్ ఛేంజర్‘ ఫ్లాప్ అవ్వడంతో.. RC16 ని వీలైనంత తొందరగా విడుదల చేయాలని మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు. అన్నీ కుదిరితే ఈ ఏడాది ద్వితియార్థంలోనే RC16 విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమాకోసం ‘పెద్ది‘ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.