'RC 16' కోసం రత్నవేలు ప్రయోగం!
సినిమా ఇండస్ట్రీ పూర్తిగా డిజిటల్ వైపు మళ్లిన ఈ రోజుల్లో, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఓ అరుదైన ప్రయోగానికి సిద్ధమయ్యాడట. రామ్ చరణ్ నటిస్తున్న ‘RC 16’ సినిమాలో కొన్ని ముఖ్యమైన భాగాలను నెగటివ్ ఫిలిం పై షూట్ చేస్తున్నాడట.;
సినిమా ఇండస్ట్రీ పూర్తిగా డిజిటల్ వైపు మళ్లిన ఈ రోజుల్లో, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఓ అరుదైన ప్రయోగానికి సిద్ధమయ్యాడట. రామ్ చరణ్ నటిస్తున్న ‘RC 16’ సినిమాలో కొన్ని ముఖ్యమైన భాగాలను నెగటివ్ ఫిలిం పై షూట్ చేస్తున్నాడట.
ఒకప్పటి ఫిలిం ఇండస్ట్రీ నెగటివ్ రీల్స్ ఆధారంగా పని చేసేది. అయితే, ఇది ఖరీదైన ప్రక్రియ కావడంతో టెక్నాలజీ అభివృద్ధి చెందాక డిజిటల్ కెమెరాలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. డిజిటల్ వల్ల రీటేక్స్ చేయడం తేలిక. ఖర్చు తగ్గే అవకాశం ఉంది. కానీ నెగటివ్ ఫిల్మ్ ద్వారా సహజమైన రంగులు, ఆర్గానిక్ టెక్స్చర్స్ పొందవచ్చు.
హాలీవుడ్ లో చాలామంది ఈమధ్య కాలంలో మళ్లీ నెగటివ్ బాట పట్టారు. అందుకే రత్నవేలు కూడా 'RC 16'లోని కొన్ని భాగాలను నెగటివ్ పై చిత్రీకరిస్తున్నాడట. ఈ సినిమా ఆద్యంతం 30, 40 ఏళ్ల క్రితం నాటి బ్యాక్‌డ్రాప్ తో రాబోతుంది. ఆనాటి పరిస్థితులను అథెంటిక్ గా చూపించడానికే ఈ నెగటివ్ ప్రయోగం చేస్తున్నాడట రత్నవేలు.
ఇక నెగటివ్ ఫిల్మ్ ఖరీదైనదే కాకుండా, ఇప్పుడు దొరకడమూ కష్టమే. ఎందుకంటే డిమాండ్ తగ్గిపోవడంతో కంపెనీలు ఉత్పత్తి తగ్గించాయి. అయినా రత్నవేలు అండ్ టీమ్ ఈ ప్రయోగం విజయవంతం చేస్తే, టాలీవుడ్‌లో మళ్లీ నెగటివ్ ఫిల్మ్‌కు రీవైవల్ అవకాశం లేకపోలేదు. ఇక రామ్ చరణ్ తో ఇప్పటికే 'రంగస్థలం' వంటి హిట్ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించాడు రత్నవేలు. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న 'RC 16' లేటెస్ట్ గా కొత్త షెడ్యూల్ మొదలు పెట్టుకుంది.