డబ్బింగ్ చెబుతున్న రామ్!
ఎనర్జిటిక్ స్టార్ రామ్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న సినిమా ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకుంది.;
ఎనర్జిటిక్ స్టార్ రామ్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న సినిమా ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి 'ఆంధ్రా కింగ్ తాలూకా' అనే పేరు పరిశీలనలో ఉంది. మే 15న రామ్ బర్త్డే స్పెషల్ గా ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రాబోతుంది. అందుకు సంబంధించి రామ్ డబ్బింగ్ చెబుతున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.
ఈ సినిమాలో రామ్.. సాగర్ పాత్రలో కనిపించబోతున్నాడు. మ్యూజికల్ డ్యూయో వివేక్-మెర్విన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, విటివి గణేష్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.