రజనీ-కమల్ మల్టీస్టారర్!
తమిళ చిత్ర పరిశ్రమలో ఐదు దశాబ్దాలకు పైగా కథానాయకులుగా కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. అది రజనీకాంత్, కమల్ విషయంలో సాధ్యపడింది. ఇక కోలీవుడ్‌ని దాదాపు మూడు దశాబ్దాలపాటు ఏక ఛత్రాధిపత్యంగా ఏలారు ఈ వెటరన్ సూపర్ స్టార్స్.;
తమిళ చిత్ర పరిశ్రమలో ఐదు దశాబ్దాలకు పైగా కథానాయకులుగా కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. అది రజనీకాంత్, కమల్ విషయంలో సాధ్యపడింది. ఇక కోలీవుడ్‌ని దాదాపు మూడు దశాబ్దాలపాటు ఏక ఛత్రాధిపత్యంగా ఏలారు ఈ వెటరన్ సూపర్ స్టార్స్. మరోవైపు సుమారు 16 సినిమాల్లో కలిసి నటించిన ఘనత కూడా తమిళనాట రజనీకాంత్-కమల్ హాసన్ సొంతం చేసుకున్నారు.
ఇక దాదాపు 40 ఏళ్ల తర్వాత మరోసారి రజనీకాంత్-కమల్ హాసన్ కాంబోలో మల్టీస్టారర్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కమల్ కి 'విక్రమ్' వంటి విజయాన్నందించి.. ఇప్పుడు రజనీకాంత్ తో 'కూలీ' సినిమాని తెరకెక్కిస్తున్న లోకేష్ కనకరాజ్ ఈ క్రేజీ కాంబోకి శ్రీకారం చుట్టబోతున్నాడు.
గ్యాంగ్‌స్టర్ మూవీస్ ను తీర్చిదిద్దడంలో లోకేష్ ది ప్రత్యకమైన శైలి. ఇప్పుడు రజనీ-కమల్ కోసం అలాంటి తరహా సబ్జెక్ట్‌ను రెడీ చేస్తున్నాడట. వృద్ధాప్యంలోకి ప్రవేశించిన గ్యాంగ్ స్టర్లుగా కనిపించే కాన్సెప్ట్‌తో కథ సిద్ధం చేస్తున్నానని, అందుకు రజనీ, కమల్ ఇద్దరూ ఓకే చెప్పారంటూ లోకేష్ స్పష్టంగా చెప్పేశాడు. త్వరలోనే ఈ కాంబో మూవీ గురించి అధికారిక ప్రకటన రానుందట.